కాంగ్రెస్ చేస్తున్న కొత్త స్కామ్ ఇది: హరీష్ రావు
HYD: ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ కాదు, ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కుంభకోణాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొత్త స్కామ్ ఇదని, HYDలోని పారిశ్రామిక వాడల్లో ఉన్న దాదాపు 10 వేల ఎకరాల భూములను పప్పు బెల్లాల్లాగా అమ్మే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.