ఈ నెల 15న మానాపురం రైల్వే గేటు మూసివేత

VZM: ఈ నెల 15న మానాపురం రైల్వే గేటు మూసి వేస్తున్నట్టు గజపతినగరం సర్కిల్ రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే గేటు మరమ్మత్తుల నిమిత్తం గేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. 15న రాత్రి 10:00 నుండి 16న ఉదయం 5 గంటల వరకు గేటు మూసివేస్తున్నామని చెప్పారు. ఈ అంతరాయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.