రిటైర్డ్ టీచర్‌ను నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు

W.G: ఆకివీడులో రిటైర్డ్ టీచర్ కే. రాజేశ్వరి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది.సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని అకౌంట్ నుంచి ఆమెకు డబ్బు జమ అయిందని నమ్మించారు. వివిధ దశల్లో ఆమె తన బ్యాంక్ ఖాతా నుంచి RTGS ద్వారా రూ. 93.5 లక్షలు బదిలీ చేసి మోసపోయినట్లు తెలిపింది.