దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించిన రామ్మోహన్ రెడ్డి
MHBD: ఇటీవల కురిసిన భారీ వర్షానికి తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బొట్ల నరసయ్య అనే రైతుకు చెందిన వరి పొలం దెబ్బతింది. బుధవారం బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ లేగా రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పంట పొలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు.