'నానో యూరియా వాడకం వల్ల అధిక దిగుబడి'

KMM: నానో యూరియా వాడకం వల్ల పంట అధిక దిగుబడి వస్తుందని DAO పుల్లయ్య అన్నారు. ఇవాళ ముదిగొండ మండలం పమ్మిలో పత్తి రైతులకు నానో యూరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నానో యూరియాను నీటిలో కలిపి కూడా పిచికారి చేయవచ్చని చెప్పారు. రైతులు నానో యూరియాపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ADO విజయ్ చంద్ర, ఏవో సరితా తదితరులు పాల్గొన్నారు.