'వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి'
ASR: కార్తీకవన సమారాధన వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంగా వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రకృతిని కాపాడటం, ప్రకృతి పాత్ర గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.