VIDEO: అలరించిన కూచిపూడి నృత్యం
SRD: రామచంద్రాపురం చందానగర్ హుడా కాలనీలోని శ్రీ లలితాదేవి మందిరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వడ్ల నివేదిత కూచిపూడి నృత్యం అద్భుతంగా ప్రదర్శించింది. సంకీర్తన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆమె చేసిన నృత్యం భక్తులను, పట్టణవాసులను విశేషంగా అలరించింది. నిర్వాహకులు నివేదితను ఘనంగా సన్మానించి, ఆమె ప్రతిభను అభినందించారు.