తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన తైజుల్!

తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన తైజుల్!

బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చరిత్ర సృష్టించాడు. బంగ్లా తరఫున 250 టెస్ట్ వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక బౌలర్‌గా అవతరించాడు. ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్‌ని ఔట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 53వ బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక టెస్టు వికెట్లతో మురళీధరన్(SL-800), షేన్ వార్న్(AUS-708), జేమ్స్ ఆండర్సన్(ENG-704) టాప్ 3 స్థానాల్లో ఉన్నారు.