'రోడ్డు పనులు నాణ్యతకు లోటు రాకుండా పూర్తి చేయాలి'
VKB: డబుల్ రోడ్డు పనులను నాణ్యతకు లోటు రాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డి పల్లి వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు పనుల పురోగతిని పరిశీలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులను పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.