శౌర్య అవార్డు గ్రహీత డీఎస్పీకి ఘన సన్మానం

శౌర్య అవార్డు గ్రహీత డీఎస్పీకి ఘన సన్మానం

ములుగు: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ రవీందర్ శౌర్య అవార్డు పొందిన సందర్భంగా గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. జిల్లాలో డీఎస్పీగా చేసిన ఉత్తమ సేవలకు రాష్ట్ర పోలీస్ శాఖ ఈ అవార్డును ప్రదానం చేసింది.