శ్రీశైలంలో అన్నదాన పథకానికి డోన్ భక్తుల విరాళం

NDL: శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద పథకానికి డోన్‌కు చెందిన రాజ విజయ కుమార్, దంపతులు శుక్రవారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు దేవస్థానం అన్నప్రసాద విభాగం కార్యాలయానికి చేరుకుని పర్య వేక్షకులు దేవికను కలిసి విరాళం చెల్లించారు.