మీకోసం కార్యక్రమానికి 55 ఫిర్యాదులు

ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 55ఫిర్యాదులు అందాయి. సబ్ కలెక్టర్ సౌర్యమన్, డీఆర్వో కే.పద్మలత కలిసి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.