గాజువాక టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక

గాజువాక టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక

VSP: రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోమ‌వారం గాజువాక టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలకు తగిన సూచనలు చేసి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.