'రోడ్డు మార్గం కోసం గ్రామాలన్నీ ఏకమయ్యాయి'
ADB: భీంపూర్ మండలంలోని సావర్గామ నుంచి గుబిడి గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామాలన్నీ ఏకమై కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడును విన్నవించారు. నెలలు గడిచిన గుత్తేదారు పనులను కొనసాగించకపోవడంతో నానా అవస్థలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులను త్వరలో ప్రారంభించక పోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మండలవాసులు హెచ్చరించారు.