BC సంక్షేమ శాఖ అధికారులతో పొన్నం సమీక్ష
TG: బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. బీసీల విద్య, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా రూపొందించాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాల నుంచే ఆర్థిక అక్షరాస్యత పరిచయం చేయాలని సూచించారు.