VIDEO: సిద్దేశ్వర స్వామికి విశేష పూజలు

హన్మకొండలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలో గల సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు శ్రావణమాసం చివరి సోమవారం, దశమి తిధి సందర్బంగా గజమాలతో స్వామికి పూలతో అలంకరణ చేసి, డమరుకం నాదంతో హారతి ఇచ్చారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.