చైనా మాంజా విక్రయంపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
NRML: జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని అరికట్టేందుకు పోలీసులు మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. పతంగుల సీజన్ ముందస్తుగా రావడంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగం,రవాణా, నిల్వ,విక్రయాలను పూర్తిగా నిరోధించాలని లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.