రెబ్బెనలో అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి

రెబ్బెనలో అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి

ASF: భారత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆశయాలు కొనసాగిద్దామని బీజేపీ మండల అధ్యక్షుడు రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన మండల కేంద్రంలో వాజ్‌పేయి వర్ధంతిని నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తిరుపతి, మల్లేష్, మధుకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.