VIDEO: యువకునిపై అమానుష దాడి

VIDEO: యువకునిపై అమానుష దాడి

అన్నమయ్య: పీలేరు పట్టణం సైనిక్‌నగర్‌లో బాబు అనే వ్యక్తి, ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందకు చెందిన రమేష్‌పై అమానుష దాడికి పాల్పడ్డాడు. సీవీ మహల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో బాబు రమేష్‌ను రాళ్లతో కొట్టి, కాళ్లతో తన్నినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆపస్మారక స్థితికి చేరుకోగా హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.