'పిచ్చి మొక్కలు తొలగించడం పట్ల గ్రామస్తుల హర్షం'
ADB: గుడిహత్నూర్ మండలంలోని కొలహరి నుంచి డోంగర్ గావ్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్థానికులు సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి అంజలిని కోరగా.. సోమవారం సంబంధిత సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ మేరకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.