రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రకాశం: మార్కాపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.