‘మండపేట మున్సిపాలిటీని ఎస్సీ జనరల్‌కు రిజర్వుడ్ చేయాలి’

‘మండపేట మున్సిపాలిటీని ఎస్సీ జనరల్‌కు రిజర్వుడ్ చేయాలి’

కోనసీమ: మండపేట పురపాలక సంఘాన్ని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని MRPS నాయకుడు ధూళి జయరాజు డిమాండ్ చేశారు. మండపేట పురపాలక సంఘ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.