ప్రధాని మోదీకి మంగళగిరి శాలువాతో సత్కారం

ప్రధాని మోదీకి మంగళగిరి శాలువాతో సత్కారం

GNTR: అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన ఆయన మంగళగిరి చేనేత శాలువాతో ఘనంగా సత్కరించారు. లోక్ సభలో రాజధాని బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని లోకేష్ పేర్కొన్నారు. ఈ బిల్లుతో అమరావతి నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయన్నారు.