బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరికలు
WNP: చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ నాయకులు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.