దేశీ కోళ్ల పెంపకం ఓ గొప్ప అవకాశం
గిరిజన ఆవాసాలలో గిరిజనుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 'దేశీ కోళ్ల పెంపకం' ఒక గొప్ప అవకాశమని జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించడంమే ఉద్దేశమన్నారు.