ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
KNR: బలిజల ఆరాధ్య దైవం మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు చొప్పదండి పట్టణంలో సోమవారం వీర శైవ లింగాయత్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయబ్ తహసీల్దార్ మన్మిత్ సింగ్ హాజరై బసవన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసవన్నను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.