కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్
KMR: బాన్సువాడ మండలం బోర్లంలో వరి కొనుగోలు కేంద్రాన్ని బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నెర్రె నర్సింహులు ఆదివారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు తూకం చేసుకోవాలని సూచించారు. వడ్లు తూకం అయిన వెంటనే లారిల్లో రైస్ మిల్లకు పంపించే విధంగా కృషి చేయాలన్నారు. తేమ ఉందని రైతులకు ఇబ్బంది చేయకూడదని నిర్వాహకులకు సూచించారు.