రైతు సమస్యల పరిష్కారానికై బీజేపీ ధర్నా

పెద్దపల్లి రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ.. సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రూరల్ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.