VIDEO: బోటుపై ప్రయాణించిన ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలం, సున్నంబట్టి గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ సీతమ్మ బోటుపై గురువారం పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో సున్నంబట్టి గ్రామం మునుగుతుందని స్థానికులు తెలపగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.