యాంటీ ర్యాగింగ్ పై పోలీసులు అవగాహన

యాంటీ ర్యాగింగ్ పై పోలీసులు అవగాహన

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో మంగళవారం ఏఎస్ఐ అరుణకుమారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అదేవిధంగా శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా తన సెల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.