'ఇలాంటి దాడులను ప్రజలు ఖండించాలి'
VKB: గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని వీర వైశ్య లింగ సమాజం సభ్యులు తెలిపారు. కొట్టలపల్లి సర్పంచ్ భర్తపై జరిగిన దాడికి వ్యతిరేకంగా కుల్కచర్లలో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామన్నారు. దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను సమాజంలోని వ్యక్తులు అందరూ ఖండించాలని తెలిపారు.