రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు: మంత్రి

SKLM: రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుంది అని తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.