'ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి'

ప్రకాశం: పార్టీకి విధేయులుగా ఉండి, ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి స్వామి అన్నారు. సింగరాయకొండలో శనివారం సాయంత్రం కొండేపి ఏఎంసీ ఛైర్మన్ తిరుపతమ్మ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులు జనార్దన్ రెడ్డి, స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.