చేపూర్ దత్త సాయి ఆలయానికి సిలిండర్ బుడ్డి వితరణ

NZB: ఆర్మూర్ మండలంలోని చేపూర్ దత్త సాయి ఆలయానికి అంబల్ల శ్రీనివాస్ ఇండియన్ గ్యాస్ మోర్తాడ్ డీలర్ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో జరుగుతున్న ఇబ్బందిని గమనించి బుధవారం సాయిబాబా ఆలయ కమిటీ వారికి సిలిండర్ బుడ్డి వితరణగా అందజేశారు. వితరణగా అందజేసిన అంబల్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు దత్త సాయి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.