గన్నవరంలో రైతులకు రూ.12.40 కోట్లు
కృష్ణా: ఉగాది కానుకగా రైతులకు అన్నదాత–సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి గ్రామంలో ప్రారంభించనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో మొత్తం 22,951 మంది రైతులు లబ్ధి పొందనుండగా, వారికి రూ.12.40 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.