నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం

PLD: దాచేపల్లి ఏపీ మోడల్ స్కూల్‌లో పోలీసులు 'నషా ముక్త్ భారత్ అభియాన్'పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యలను వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం అవసరమని తెలిపారు. విద్యార్థులందరితో ‘మాదకద్రవ్య రహిత దేశం’ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.