బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి

NZB: సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోర్టులో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ఆ రోజుల్లో సత్యశోధక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యపై ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.