ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్దిపేట కవి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కవి, రచయిత ముక్కెర సంపత్ కుమార్‌కు అరుదైన అవకాశం లభించింది. ఏపీలోని గుంటూరులో ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంపత్ ఎంపికయ్యారు. ఈ మేరకు సరస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఇవాళ ఆహ్వాన పత్రిక పంపించారు.