రోడ్డుపై వరద నీరు..

SRD: సిర్గాపూర్‌లోని ఓ వీధిలోని తాగునీటి మినీ ట్యాంక్ నల్లాలు లీకవుతుండడంతో, బిందెలు నిండాక వెంటనే కుళాయిలు ఆఫ్ చేయకపోవడం వల్ల తాగునీరు రోడ్డుపై పారుతోంది. ఫలితంగా దారి బురదగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం రోడ్డుపై నీరు నిలుస్తుండటంతో గోతులు ఏర్పడి ప్రమాదాలకు ఆస్కారం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.