ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
KMM: సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో నక్క వెంకటేశ్వరరావు–ఆదిలక్ష్మి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ పాల్గొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నాగేశ్వరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.