అక్రమ మైనింగ్‌పై రైతుల సమరం

అక్రమ మైనింగ్‌పై రైతుల సమరం

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారు జవాన్లబోడులో అక్రమ మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. పంట పొలాల మధ్య మైనింగ్‌తో సాగు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ లేకుండా లీజు ఇవ్వడంపై మండిపడుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. న్యాయం జరగకుంటే కలెక్టర్‌ తేజస్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు...