నరసాపురంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
W.G: నరసాపురం వైఎన్ కళాశాలలో బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. నరసాపురం మండల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 100కు పైగా సైన్స్ అంశాలను ప్రదర్శించారు. సాయంత్రం జరిగే ముగింపు సభలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని ఎంఈఓలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ తెలిపారు.