సోమశిల జలాశయానికి భారీగా వస్తున్న వరద

NLR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాను అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 73.450 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 23234 క్యూసెక్కుల నీరు వస్తున్నాయి.