అనుమతి లేని క్లినిక్ మూసివేత

JGL: మెట్పల్లి పట్టణంలో ఎలాంటి అనుమతులు, అర్హత కలిగిన వైద్యులు లేకుండా చికిత్స అందిస్తున్న జ్యోతి క్లినిక్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ మంగళవారం మూసివేయించారు. క్లినిక్ సంబంధితులను పోలీస్లకు అప్పగించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులలో గుర్తింపు, అర్హత లేకుండా చికిత్సలు అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.