ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

NGKL: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోడేరుకు చెందిన అరిగెల దేవమ్మ (65) అనే మహిళ కుటుంబ కలహాలతో తరచూ భర్తతో  గొడవపడేది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.