వాంఖడే పిచ్‌పై బ్యాటర్లకు పండగే..!

వాంఖడే పిచ్‌పై బ్యాటర్లకు పండగే..!

రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సూపర్-8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ ఇదే స్టేడియంలో 254/6 పరుగులు చేసింది. దీంతో రేపటి మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఈ పిచ్‌పై యావరేజ్ స్కోరు 177.