రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
BDK: అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఓ ద్విచక్ర వాహనదారుడు అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి తీవ్ర గాయాల పాలయ్యాడని చెప్పారు. స్పందించిన స్థానికులు అతడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.