ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి
కృష్ణా: అవనిగడ్డలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా జరిగింది. ఫైర్ స్టేషన్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేసిన ఆయన చిరస్మరణీయలు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.