మ్యాచ్ ఆడితే రూ.1,000 వచ్చేది: మిథాలీ
మహిళల WC విజయం తర్వాత, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. గతంలో మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులు లేవని ఆమె తెలిపింది. 2005 WCలో ఒక్కో మ్యాచ్‌కు రూ.1,000 చొప్పున మొత్తం రూ.8,000 మాత్రమే తమకు వచ్చినట్లు పేర్కొంది. అయితే, ప్రస్తుత WCలో భారత ప్లేయర్లకు కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే రూ.54 లక్షలు లభించాయి.