'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

'నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

Vsp: నీరు జీవనాధారం కాబట్టి జలవనరులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పర్యావరణ వేత్త డాక్టర్‌ తాతా ప్రకాశం అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.